ముఖేశ్‌గౌడ్‌ ప్రచారరథంపై దాడి | - | Sakshi
Sakshi News home page

ముఖేశ్‌గౌడ్‌ ప్రచారరథంపై దాడి

Feb 8 2026 3:54 AM | Updated on Feb 8 2026 3:54 AM

ముఖేశ్‌గౌడ్‌ ప్రచారరథంపై దాడి

ముఖేశ్‌గౌడ్‌ ప్రచారరథంపై దాడి

● కాంగ్రెస్‌ నాయకులపై డీసీపీకి ఫిర్యాదు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మున్సిపల్‌ ఎన్నికలు జిల్లా కేంద్రంలో తారాస్థాయికి చేరుతున్నాయి. నగరంలో పలు డివిజన్లలోని రాజకీయాలు వ్యక్తిగత గొడవల వరకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణలకు దారి తీస్తున్నాయి. 57 డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నగర మేయర్‌ అభ్యర్థి గాజుల ముఖేశ్‌గౌడ్‌ ప్రచార రథంపై దాడులకు పాల్పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ వాళ్లే కొందరిని ఉసిగొల్పి తమపై ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై బీజేపీ అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్‌ గౌడ్‌ డీసీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మంచిర్యాల కార్పొరేషన్‌ 58 మంది అభ్యర్థులు తమ పార్టీ నుంచి బరిలో ఉన్నారని వారికి ప్రచారంలో ఆటంకం కల్గించేవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఫిర్యాదు ఇచ్చిన పోలీసులు పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement