ఇంటికి చేరిన బండి దాదా
మందమర్రిరూరల్: సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) కార్యదర్శిగా పనిచేసి ఇటీవల అజ్ఞాతం వీడిన బండి ప్రకాష్ అలియాస్ బండి దాదా బుధవారం రాత్రి మందమర్రి మూడోజోన్‌లోని తన ఇంటికి భార్య హేమతో కలిసి చేరుకున్నారు. 25 ఏళ్ల ఆజ్ఞాత వాసం, పదిపహేనేళ్ల జైలు జీవితం అనుభవించిన ఆయనను గురువారం ‘సాక్షి’తో పలు విషయాలు వెల్లడించారు. అనారోగ్య కారణాలతో అజ్ఞాతం వీడినట్లు తెలిపారు. ప్రస్తుతం చికిత్స చేయించుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఐదెకరాల వ్యవసాయ భూమి, ఇంటిస్థలం ఇవ్వాలని కోరుతున్నాడు. బండి ప్రకాష్ దంపతులు మందమర్రికి వచ్చిన విషయం తెలియడంతో అతని సన్నిహితులు, చిన్ననాటి మిత్రులు కలిసి గత స్మృతులు గుర్తు చేసుకున్నారు.


