ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
చెన్నూర్: ఆస్పత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని హెల్త్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కోటేశ్వర్‌రావు అన్నారు. గురువారం చెన్నూర్ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలన్నారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ, సిబ్బంది ఉన్నారు.
వివాహిత అదృశ్యం
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన వివాహిత అదృశ్యమైంది. గతనెల 31న ఉద యం తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కుటుంబీకులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. మహిళ సోదరుడు గురువారం టూటౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.


