తండ్రి గెలుపు కోసం లండన్ నుంచి..
ఆసిఫాబాద్‌అర్బన్: మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచిన తండ్రి గెలుపు కోసం ఓ కుమార్తె లండన్ నుంచి వచ్చి ఓటేశారు. కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలోని ఆరో వార్డు నుంచి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలువేరు వెంకన్న పోటీ చేస్తున్నారు. అతని కుమార్తె చిలువేరు శ్రేయ లండన్‌లో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగాన్వేషణలో ఉంది. తండ్రి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో ముందుగానే స్వదేశానికి చేరుకుంది. స్థానిక జెడ్పీ ఉర్దూ పాఠశాలలో బుధవారం ఓటుహక్కు వినియోగించుకుంది. బాధ్యతగా ఓటు వేసిన శ్రేయను కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు.


