సీఎం కప్‌ జిల్లా స్థాయి పోటీలు | - | Sakshi
Sakshi News home page

సీఎం కప్‌ జిల్లా స్థాయి పోటీలు

Feb 15 2026 9:39 AM | Updated on Feb 15 2026 9:39 AM

సీఎం కప్‌ జిల్లా స్థాయి పోటీలు

సీఎం కప్‌ జిల్లా స్థాయి పోటీలు

మందమర్రిరూరల్‌: మందమర్రిలోని సింగరేణి హైస్కూల్‌ మైదానంలో జిల్లా స్థాయి సీఎం కప్‌ ఆటపోటీలు శనివారం నిర్వహించారు. పోటీలను జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య ప్రారంభించారు. హ్యాండ్‌బాల్‌, ఆటియా పాటియా, ఫెన్సింగ్‌, నెట్‌బాల్‌, కరాటే, ఓషో, జోడో, కిక్‌బాక్సింగ్‌ పోటీల్లో జిల్లా నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటాలని తెలిపారు. ఏరియా జీఎం రాధాకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా ఏడీ దుర్గాప్రసాద్‌, ఎంఈవో రమేష్‌, సీఐ రమేష్‌, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా కోశాధికారి రమేష్‌, బాస్కెట్‌ బాల్‌ సెక్రెటరీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రతిభ

మంచిర్యాలఅర్బన్‌: స్థానిక ఎస్సీ బాలురు, బాలికల కళాశాల వసతిగృహం విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబర్చారు. మంచిర్యాల బాలుర హైస్కూ ల్‌ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్‌ పోటీల్లో అండర్‌–18 విభాగంలో 1000మీటర్ల పరుగు పందెంలో అజ్మ బంగారు పతకం, 400 మీ టర్ల పరుగు పందెంలో దుర్గం అనిల్‌ వెండి, షాట్‌పుట్‌లో పవన్‌ బంగారు పతకం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. విద్యార్థులను సోషల్‌ వెల్పేర్‌ ఆఫీసర్‌(డీడీ) దుర్గాప్రసాద్‌, వసతి గృహ సంక్షేమాధికారులు చందన, కుమారస్వామి అభినందించారు.

దండేపల్లి: సీఎం కప్‌ జిల్లా స్థాయి పోటీల్లో మండలంలోని రెబ్బనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ఎంఈవో మంత్రి రాజు తెలిపారు. వాలీబాల్‌ పోటీల్లో బాలికలు, బ్యాడ్మింటన్‌ పోటీల్లో రామ్‌చరణ్‌ జిల్లాస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement