ఊరంతా ఏకమై.. ఆర్థికసాయం అందించి..
ఇంద్రవెల్లి: మండలంలోని సమాకా గ్రామ ఆదివాసీలు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామానికి చెందిన మడావి (కిరణ్) ధర్మరాజ్ వివాహం గురువారం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. గ్రామస్తులంతా ఏకమై చందాల రూపంలో వసూలు చేసిన రూ.25 వేలు బుధవారం యువకుడి తల్లిదండ్రులకు అందించారు. ఈ సందర్భంగా గ్రామ పటేల్ పెందోర్ భగవత్‌రావ్ మాట్లాడు తూ గ్రామానికి చెందిన యువతీ యువకుల వివా హానికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో మూడు సంవత్సరాలుగా ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కొరెంగా యెశ్వంత్‌రావ్ మహరాజ్, గ్రామస్తులు పాల్గొన్నారు.


