కంటోన్మెంటు ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
మంచిర్యాలక్రైం: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సికింద్రాబాద్ కంటోన్మెంటు ఎమ్మెల్యే శ్రీగణేష్‌కు ప్రమాదం తప్పింది. సోమవారం మధ్యాహ్నం కోరుట్ల బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జిల్లా కేంద్రం మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తాలో ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దూసుకొచ్చింది. దీంతో ఆయన వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బస్సు డ్రైవర్ జక్కుల మల్లేష్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. 150పాయింట్ల వరకు మద్యం సేవించినట్లు తేలింది. డ్రైవర్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి కోరుట్ల బస్ డిపో అధికారులకు సమాచారం అందించినట్లు సీఐ ప్రమోద్‌రావు తెలిపారు.


