జిల్లా వాసికి బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అవార్డు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఫొటో ఫినాఎక్స్‌పో ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఫొటో పరివార్ ఇండియన్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అవార్డ్స్–2026 వేడుకల్లో మంచిర్యాలకు చెందిన జక్కుల రాజుకు అరుదైన గౌరవం దక్కింది. సినీ నిర్మాత భరద్వాజ్, ఫొటోటెక్ అధినేత అభిమన్యురెడ్డి, ఎడిట్ పాయింట్ రమేశ్, ఫొటోగ్రఫీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాపల్లి శ్రీనివాస్‌గౌడ్, కలర్స్ సతీశ్ చేతుల మీదుగా బెస్ట్ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ అవార్డు అందుకున్నారు. అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు.


