సల్లంగసూడు తల్లీ..
ఖానాపూర్ పట్టణం శాంతినగర్ కాలనీలోని శ్రీముత్యాల పోచమ్మ ఆలయం 20వ వార్షిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం పండితులు పాలెం మనోహరశర్మ, అర్చకులు నిమ్మగడ్డ శరత్‌చంద్రశర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, సామూహిక కుంకుమార్చన, రుద్ర హవనం, మహాపూజ, హారతి నిర్వహించారు. అనంతరం ముత్యాల పోచమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. ఇందులో పోచమ్మ వేషధారణ, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కల్వకుంట్ల నారాయణ, తిమ్మాపూర్ వీడీసీ అధ్యక్షుడు బీసీ. రాజన్న, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. – ఖానాపూర్
బాసరకు పోటెత్తిన భక్తులు
అ‘పూర్వ’ం..ఆత్మీయం
సల్లంగసూడు తల్లీ..
సల్లంగసూడు తల్లీ..


