చోరీకి ప్రయత్నించిన ఒకరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీకి ప్రయత్నించిన ఒకరి అరెస్ట్‌

Feb 14 2026 9:08 AM | Updated on Feb 14 2026 9:08 AM

చోరీకి ప్రయత్నించిన ఒకరి అరెస్ట్‌

చోరీకి ప్రయత్నించిన ఒకరి అరెస్ట్‌

మందమర్రిరూరల్‌: మందమర్రి ఏరియాలోని కేకే ఓసీ ఆవరణలో శుక్రవారం తెల్లవారుజామున చోరీకి ప్రయత్నించిన ఇద్దరు యువకులను సెక్యూరిటీ ఎంటీఎఫ్‌ టీమ్‌ గమనించి వెంబడించగా ఒకరు దొరికారు. మరొకరు పారిపోయారు. దొరికిన వ్యక్తి నుంచి బైక్‌, మూడు రూలర్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అతడి నుంచి కేబుల్‌ కట్‌ చేసే బ్లేడ్‌, టెస్టర్‌, డిటెక్టర్స్‌ తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక చెంచు కాలనీకి చెందిన వారిగా గుర్తించినట్లు ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది తెలిపారు. వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి మిర్యాల సంజీవ్‌ను పోలీసులకు అప్పగించినట్లు ఏఎస్‌వో రవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement