45 వేల ఉద్యోగాల హామీ ఏమైంది
రామకృష్ణాపూర్: గత ఎన్నికల సందర్భంగా చెన్నూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతకు 45 వేల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన మంత్రి వివేక్ ఆ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయమాటలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో చేసిందేమీ లేదన్నారు. మంత్రి వివేక్‌కు ఓట్లు కొనడంలో ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజలు బీఆర్‌ఎస్, సీపీఐ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్‌గౌడ్, నాయకులు మేలిపెల్లి సంపత్, బడికల సంపత్, రామిడి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
‘ఫైర్‌స్టేషన్ భూమి కబ్జాకు యత్నం’
మంచిర్యాలటౌన్: మంచిర్యాలలోని ఫైర్‌స్టేషన్ స్థలాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫైర్‌స్టేషన్‌ను మరోచోటుకు మార్చి రూ.50 కోట్ల విలువచేసే ఆ స్థలాన్ని తప్పుడు పేపర్లు సృష్టించి కాజేయాలని చూస్తున్నాడన్నారు. అదే జరిగితే ఫైర్‌స్టేషన్ వద్దనే ఆమరణ నిరహారదీక్ష చేస్తానన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మాజీ కౌన్సిలర్ వంగ తిరుపతి, నాయకులు ఎర్రం తిరుపతి, ముత్తె రాజేశం, పెట్టం లక్ష్మణ్, కర్రు శంకర్, బండారి తిరుపతి, కలువల వెంకటసాయి, కృష్ణ, కుందారపు రమేశ్, రఫీఖాన్, దండేపల్లి మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, హాజీపూర్ మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, దండేపల్లి మాజీ ఎంపీపీ అనిల్, తదితరులు పాల్గొన్నారు.
45 వేల ఉద్యోగాల హామీ ఏమైంది


