ఎవరి పురమో..! | - | Sakshi
Sakshi News home page

ఎవరి పురమో..!

Feb 13 2026 3:55 AM | Updated on Feb 13 2026 3:55 AM

ఎవరి పురమో..!

ఎవరి పురమో..!

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

మూడు గంటల్లోనే సగం చోట్ల ఫలితాలు

రెండు రౌండ్లలోనే మున్సిపల్‌ విజేతలు

మంచిర్యాల నగరం, నాలుగు బల్దియాల్లో పోలైన ఓట్లు 2.01లక్షలు

చెన్నూర్‌ రెండో వార్డులో త్వరగా.. మంచిర్యాల 52వ డివిజన్‌లో ఆలస్యం

గెలుపోటములపై బెంగతో అభ్యర్థులకు నిద్ర కరువు

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మున్సిపల్‌ ఎన్నికల ఫలితం మరికొద్ది గంటల్లోనే వెలువడనుంది. విజేతలెవరో.. పరాజితులెవరో తేలిపోనుంది. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలై మధ్యాహ్నం 2గంటల వరకు ఫలితాలు తేలిపోనున్నాయి. చెన్నూర్‌ రెండో వార్డులో 817 ఓటర్లు ఉండగా.. ఇక్కడ లెక్కింపు మొదలైన రెండు గంటల్లోనే ఫలితం రానుంది. ఇక మంచిర్యాల నగరం 52వ డివిజన్‌లో 4,047 ఓట్లు ఉండడంతో ఫలితం వెలువడే వరకు ఆలస్యం కానుంది. మంచిర్యాల కార్పొరేషన్‌, బెల్లంపల్లి, చెన్నూర్‌, క్యాతనపల్లి, లక్సెట్టిపేట పురపాలక సంఘాల్లోని 149వార్డుల్లో ఏర్పాటు చేసిన 444 పోలింగ్‌ కేంద్రాల్లో 2,01లక్షల ఓట్లు పోలైన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య, శిక్షణ పొందిన సిబ్బందితో పకడ్బందీగా కౌంటింగ్‌ జరగనుంది. జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి కుమార్‌ దీపక్‌ ఐదు చోట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 11న పోలింగ్‌ పూర్తయినప్పటి నుంచి అభ్యర్థులు కంటినిండా కునుకు లేకుండా ఫలితాలపై ఆతృతతో ఉన్నారు.

రెండు రౌండ్లలోనే పూర్తి

మంచిర్యాల, క్యాతనపల్లిలో రౌండ్‌కు వెయ్యి చొ ప్పున ఓట్లు లెక్కింపు జరగనుంది. రెండు టేబుళ్లు లెక్కింపు ఉన్నప్పటికీ ఒకే డివిజన్‌, వార్డుల ఓట్ల లెక్కింపు జరగనుంది. మిగతా చోట్ల మాత్రం వార్డు కు ఒక టేబుల్‌ చొప్పున మొదటి రౌండ్‌లో సగం వా ర్డులు, రెండో రౌండ్‌ సగం వార్డులు లెక్కించనున్నా రు. ఇక ఒక టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. వీరికి అదనంగా మరో పది శాతం సిబ్బంది రిజర్వు ఉంటారు. ఉదాహరణకు మంచిర్యాల నగరంలో 60డివిజన్లకు 60మంది సిబ్బందికి, 66మంది సూపర్‌వైజర్లు, ఇద్దరు అసిస్టెంట్ల చొప్పున 120కి మరో పదిశాతం అదనం కలిపితే 132మంది ఉంటారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు పోలీసు బందోబస్తు, కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమలుతోపాటు పరిమిత సంఖ్యలో అనుమతి, ర్యాలీలు, విజయోత్సవ వేడుకలపై ఆంక్షలు విధించారు.

కౌంటింగ్‌ కేంద్రాలు

మంచిర్యాల ఐజా ఇంజనీరింగ్‌ కాలేజీ, ముల్కల్ల

లక్సెట్టిపేట పాత ఎంపీడీవో ఆఫీసు, లక్సెట్టిపేట

బెల్లంపల్లి జెడ్పీ హైస్కూల్‌, బెల్లంపల్లి

చెన్నూరు జెడ్పీ హైస్కూల్‌, చెన్నూరు

క్యాతనపల్లి ఆర్కేసీవోఏ, క్లబ్‌ భవనం, క్యాతనపల్లి

జిల్లాలో కౌంటింగ్‌ సిబ్బంది వివరాలు

మున్సిపాలిటీ వార్డులు/డివిజన్లు సూపర్‌వైజర్లు అసిసెంట్లు టేబుళ్లు రౌండ్లు

మంచిర్యాల 60 60 132 60 02

బెల్లంపల్లి 34 19 37 17 02

క్యాతనపల్లి 22 24 48 22 02

చెన్నూరు 18 10 20 09 02

లక్సెట్టిపేట 15 09 18 08 02

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement