లింగనిర్ధారణ పరీక్షలు నేరం | - | Sakshi
Sakshi News home page

లింగనిర్ధారణ పరీక్షలు నేరం

Feb 13 2026 3:55 AM | Updated on Feb 13 2026 3:55 AM

లింగనిర్ధారణ పరీక్షలు నేరం

లింగనిర్ధారణ పరీక్షలు నేరం

మంచిర్యాలటౌన్‌: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, పుట్టబోయే శిశువు ఆడా, మగనా అని అడగడం, నిర్ధారణ చేసి చెప్పడం రెండూ నేరమేనని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అనిత అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జిల్లాలోని రేడియాలజిస్టులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందని, వైద్యులు చట్ట ప్రకారం నడుచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అరుణశ్రీ, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్‌ కోటేశ్వర్‌రావు, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, సీహెచ్‌వో వెంకటేశ్వర్లు, రేడియాలజిస్టులు వెంకటేశ్వర్‌రావు, రాంబాబు, కీర్తి, శ్రీనివాస్‌, సుధాకర్‌, రవి, రూపరమణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement