పులి కదలికలపై నిఘా
తాంసి: భీంపూర్ మండల సరిహద్దు పెన్‌గంగ నది పరీవాహక గ్రామాలైన తాంసి(కే), గొల్లఘాట్, గుంజాల, పిప్పల్‌కోటి శివారులో పెద్దపులి సంచరి స్తున్న విషయం తెలిసిందే. దీంతో అటవీశాఖ అ ధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఎఫ్‌ఆర్వో గులాబ్‌సింగ్ ఆదేశాల మేరకు అటవీశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పులి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి రెండురోజుల క్రితం గొల్లఘాట్ శివారులో ఎద్దుపై దాడి చేసి హతమార్చింది. ఈ ఘటనతో పులి సంచరిస్తున్న విషయం బయటకు వచ్చింది. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది పులి కదలిలకపై నిఘా పెట్టారు. రెండు రోజులుగా ఆయా గ్రామాల శివారులో అటవీశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పులి ఆనవాళ్లను పరిశీ లిస్తున్నారు. పులి ఎటు వైపు వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు సెక్షన్ అధికారులతో కూడిన రెండు బృందాలు రాత్రి, పగలు పులి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ పులి సంచరించినట్లు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో పలుచోట్ల ట్రాప్ కెమెరాలు కూడా ఏ ర్పాటు చేసి పులి కదలికలను సెక్షన్ అధికారి అహ్మద్‌ఖాన్, బీట్ అధికారి సాయికుమార్, ఎనిమల్ ట్రా కర్స్‌తో కలిసి పరిశీలిస్తున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చిన పులి ఇక్కడే మకాం వేసింది. తిరిగి తిప్పేశ్వర్ అభయారణ్యం వెళ్లాలంటే పెన్‌గంగ నది దాటాలి. కానీ, ప్రస్తుతం కొరాటా–చనాఖా బ్యారేజీ కోసం నీటిని నిలిపివేయడంతో పెన్‌గంగ నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. దీంతో పులి ఇటు వైపే ఉంటున్నట్లు అధికారులు భావిస్తున్నారు.


