సమ్మెకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సమ్మెకు దూరంగా ఉండాలి

Feb 10 2026 7:58 AM | Updated on Feb 10 2026 7:58 AM

సమ్మెకు దూరంగా ఉండాలి

సమ్మెకు దూరంగా ఉండాలి

● శ్రీరాంపూర్‌ జీఎం శ్రీనివాస్‌

శ్రీరాంపూర్‌: సింగరేణి కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని శ్రీరాంపూర్‌ జీఎం ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం జీఎం కార్యాలయంలో ఏరియా ఉన్నత అధికారులతో కలిసి సమ్మైపె సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మె సింగరేణిలో జరగకుండా చూడాలని తెలిపారు. సమ్మె జరిగితే సంస్థకు రూ.77 కోట్ల నష్టం వస్తుందని, ఉద్యోగులు రూ.12 కోట్ల వేతనాలు కోల్పోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్‌ఓటు జీఎం యన్‌.సత్యనారాయణ, ఇంజనీర్‌ టీ.రమణారావు, ఏజీఎం(ఫైనాన్స్‌) సుమలత, డీజీఎం(పర్సనల్‌) అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు. కాగా, కంపెనీ జీఎం(పర్సనల్‌) కవితానాయుడు సమ్మైపె పర్సనల్‌ డిపార్టుమెంటు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శ్రీరాంపూర్‌ నుంచి డీజీఎం(పర్సనల్‌) ఎస్‌.అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

కార్మికులు పాల్గొనవద్దు..

మందమర్రిరూరల్‌: ఒక్కరోజు సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొనవద్దని ఏరియా జీఎం రాధాకృష్ణ పిలుపునిచ్చారు. సోమవారం ఏరియా జీఎం కార్యాలయ ఆవరణలో ఏరియా అధికారులతో సమావేశం నిర్వహించారు. సమ్మెకు సంబంధించి సింగరేణి యాజమాన్యం పరిష్కరించే అంశాలు లేవని వివరించారు. సమావేశంలో ఎస్వో టు జీఎం లితేంద్రప్రసాద్‌, కేకే–సీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ మల్లయ్య, ఏరియా ఇంజనీర్‌ బాలాజీ భగవతీఝా, ఏజెంట్లు రాంబాబు, ఖాధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement