కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
● ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు
మంచిర్యాలటౌన్: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14, 19, 45, 46, 47, 48, 59వ డివిజన్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ఆదివారం స్థానిక వైశ్యభవన్ వద్ద కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే, రెండేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు, ఇవ్వని హామీ పనులను సైతం చేపట్టానన్నారు. కార్పొరేషన్ పరిధిలో చేయాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రజలకు పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనే తమ ధ్యేయమన్నారు.


