చెన్నూర్‌లో బీజేపీ బోణీ
చెన్నూర్: చెన్నూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ బోణీ కొట్టింది. 18వార్డులు ఉండగా.. రెండు స్థానాల్లో గెలుపొంది కమలం జెండా ఎగురవేసింది. 18వ వార్డు మాజీ కౌన్సిలర్ బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరి 10వ వార్డు నుంచి పోటీచేశారు. 21 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏతం శివకృష్ణ 18వ వార్డు నుంచి పోటీ చేసి 59ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. గత ఎన్నికల్లో ఒక్క స్థానం సాధించిన పార్టీ ఈసారి రెండు స్థానాల్లో విజయం సాధించడంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.


