రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక
జైపూర్: జైపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠఽశాలలో పదో తరగతి చదువున్న ఈ.గణేశ్ రాష్ట్రస్థాయి అండర్–17 క్రికెట్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు సిరంగి గోపాల్ తెలిపారు. గత నవంబర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభ కనబర్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి 15 వరకు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.
ఏపీ జట్టుకు ఆదిలాబాద్ క్రికెటర్
ఆదిలాబాద్: జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పొలమూరు మోక్షిత్ శ్రీ నైతిక్ ఆంధ్రప్రదేశ్ అండర్–14 క్రికెట్ టీం(బీ)లో స్థానం సంపాదించాడు. ఇటీవల నిర్వహించిన జిల్లా, జోనల్ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్ట్రజట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 13 నుంచి తమిళనాడులో జరగనున్న ఇన్విటేషనల్ టోర్నమెంట్లో ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ పోటీల్లో ముంబై, తమిళనాడు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల తల్లితండ్రులు పొలమూరు సింహాచలం, అనిత, శిక్షకులు జయేంద్ర పటాస్కర్, నరోత్తం రెడ్డి, విజయ్ తదితరులు అభినందనలు తెలిపారు.
సుంకిడి వాగులో పురాతన విగ్రహం
తలమడుగు: సుంకిడి గ్రామ సమీపంలో గురువారం చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లకు పురాతన విగ్రహం కనిపించింది. కొందరు వేంకటేశ్వరస్వామి విగ్రహమని, మరికొందరు సత్యనారాయణస్వామి అని, చెన్నకేశవస్వామి అని పేర్కొంటున్నారు. వేదపండితులు నేరెల్ల రంగాచార్యులుకు చూపించగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి విగ్రహంగా ఉందన్నారు.
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపిక


