కొత్త గనులు ఎందుకు తేలేదో చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

కొత్త గనులు ఎందుకు తేలేదో చెప్పాలి

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:01 PM

కొత్త గనులు ఎందుకు తేలేదో చెప్పాలి

కొత్త గనులు ఎందుకు తేలేదో చెప్పాలి

● నాడు మంత్రి పదవిలో ఉండి హరీశ్‌రావు సింగరేణికి చేసిందేమిటి? ● రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి

రామకృష్ణాపూర్‌: గత ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవిలో కొనసాగిన హరీశ్‌రావు సింగరేణిలో కొత్త బొగ్గు గనులు ఎందుకు తీసుకురాలేదో సమాధానం చెప్పాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి ప్రశ్నించారు. క్యాతనపల్లి ము న్సిపాలిటీలోని పలు వార్డుల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణిలో కొత్త గనులు తీసుకురాకపోగా ఈ ప్రాంతంలో ఖర్చు చేయాల్సిన డీఎంఎఫ్‌టీ నిధులను హరీశ్‌రావు సిద్దిపేటకు మళ్లించారని మండిపడ్డారు. బొగ్గు గనుల వేలంపాటలో సింగరేణి పాల్గొనకుండా గత సర్కార్‌ అడ్డుకుందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలను మోసగించిన బీఆర్‌ఎస్‌కు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ప్రజలు గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గత ఎమ్మెల్యే బాల్క సుమన్‌ కేసీఆర్‌, కేటీఆర్‌లను కొలుస్తూ కాలం గడిపాడని విమర్శించారు. క్యాతనపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, పల్లెరాజు, అబ్దుల్‌అజీజ్‌, వొడ్నాల శ్రీనివాస్‌, గోపతి రాజయ్య, గాండ్ల సమ్మయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement