విద్యుదాఘాతంతో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో మహిళ మృతి

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:01 PM

విద్య

విద్యుదాఘాతంతో మహిళ మృతి

కుభీర్‌: మండలంలోని రాంనాయక్‌ తండాకు చెందిన రాథోడ్‌ వనిత(35) విద్యుదాఘాతంతో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనిత శుక్రవారం ఉదయం వంటపాత్రలను శుభ్రం చేయడానికి రేకులపై ఉన్న బోళ్ల సబ్బు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురైంది. గాయపడ్డ ఆమెను కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఆమె భర్త సునీల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విద్యుదాఘాతంతో

ఆవు, దూడ మృతి

ఖానాపూర్‌: పట్టణంలోని శ్రీరాంనగర్‌ కాలనీకి చెందిన రైతు దాతుర్క శ్యామ్‌కు చెందిన ఆవుతో పాటు దూడ శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందాయి. అంబేడ్కర్‌నగర్‌ శివారులోని పంట పొలాల్లో ఎప్పటిలాగే మేతకు వెళ్లి న ఆవు, దూడ అక్కడే ఉన్న రెంకోని వాగులోకి నీరు తాగేందుకు వెళ్లాయి. వాగులో ఏర్పాటు చేసిన వ్యవసాయ మోటార్‌ ద్వారా విద్యుత్‌ షా క్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. రూ. 50వేలకుపైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. అధికారులు తనకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.

షార్ట్‌ సర్క్యూట్‌తో నిత్యావసరాలు దగ్ధం

మామడ: మండలంలోని నల్దుర్తి గ్రామానికి చెందిన సుంచు సుశీల ఇంట్లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా నిత్యావసరాలు దగ్ధమయ్యాయి. శు క్రవారం సుశీల కూలీ పనులకు వెళ్లగా కుమారుడు వేరే ఊరికి వెళ్లాడు. వారు వెళ్లిపోయాక ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని నిత్యావసరాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాన్ని సర్పంచ్‌ సునీత, రెవెన్యూ అధికారులు సందర్శించారు. వివరాలు నమోదు చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. బాధిత కుటుంబానికి సాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

జైపూర్‌: మండలంలోని కుందారం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంథనికి చెందిన పాపిట్ల రజిని (56) మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథనిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ సమీపంలో నివాసముండే పాపిట్ల విజయభాస్కర్‌–రజిని దంపతులు బైక్‌పై శుక్రవారం సాయంత్రం మంథని నుంచి సుందిళ్ల బ్యారేజీ మీదుగా మంచిర్యాలకు బంధువుల ఇంటికి వస్తున్నారు. కుందారం సమీపంలో కల్వర్టు వద్ద బైక్‌ అదుపు తప్పి కిందపడడంతో వెనుక కూర్చున్న రజిని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. విజయభాస్కర్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు రజిని మృతదేహాన్ని మంచిర్యాల ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో మహిళ మృతి1
1/1

విద్యుదాఘాతంతో మహిళ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement