ఫిన్లాండ్ నుంచి వచ్చా..
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్‌కు చెందిన డాక్టర్ ఎడ్ల సంతోష్ కుమార్ ిఫిన్లాండ్ దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్‌లో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తన ఓటుహక్కు వినియోగించుకునేందుకు వారం క్రితం కుటుంబ సమేతంగా జిల్లా కేంద్రానికి వచ్చారు. ప్రభుత్వ డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బుధవారం ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు వజ్రాయుధం వంటిందని, ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.


