హ్యాట్రిక్‌ విజేత | - | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ విజేత

Feb 14 2026 9:06 AM | Updated on Feb 14 2026 9:06 AM

హ్యాట్రిక్‌ విజేత

హ్యాట్రిక్‌ విజేత

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ 56వ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నల్ల శంకర్‌ వరుసగా మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. మంచిర్యాల మున్సిపాలిటీగా ఉన్న సమయంలో వరుసగా రెండుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మొదటిసారి ఎన్నికై నప్పుడు వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. మూడోసారి కార్పొరేటర్‌గా గెలుపొందారు.

అత్యధిక మెజారిటీ

14వ డివిజన్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా తూముల నరేశ్‌ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2987 ఓట్లు డివిజన్‌లో ఉండగా, 2455 ఓట్లు పోలయ్యాయి. అందులో 1,999 ఓట్లు నరేష్‌కు రాగా, బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వొడ్నాల రవీందర్‌కు 331 ఓట్లు మాత్రమే వచ్చాయి. చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నరేశ్‌, ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి కార్పొరేటర్‌గా భారీ మెజారిటీని సాధించడంపై పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement