పనుల పురోగతి పరిశీలించిన డీఆర్‌ఎం
మందమర్రిరూరల్: మందమర్రి–మంచిర్యాల పరిధిలోని నాన్ ఇంటర్ లాకింగ్ పనుల పురోగతిని బుధవారం మందమర్రి వద్ద సికింద్రాబాద్‌కు చెందిన డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) డాక్టర్ ఆర్.గోపాలకృష్ణ పరిశీలించారు. అధికారులను అడిగి పనుల వివరాలు తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తయితే రైళ్ల రాకపోకల్లో ఆలస్యానికి బ్రేక్ పడనుంది. పనులు జరుగుతున్న కారణంగా కొన్ని రైళ్లు మంచిర్యాల వరకే నడుస్తుండగా మరికొన్నింటిని అధికారులు దారి మళ్లించారు.
తాండూర్ చేరిన సైకిల్ యాత్ర
తాండూర్: ధర్మ ప రిరక్షణ కోసం ఒడి స్సా రాష్ట్రానికి చెందిన సుబ్రత్ మహా రాణా అనే యువకుడు చేపట్టిన సైకి ల్ యాత్ర బుధవా రం తాండూర్‌కు చేరింది. ఒరిస్సా రాష్ట్రంలోని ఝార్సుగూడ జిల్లా బెల్బిహార్‌జురా గ్రామానికి చెందిన సుబ్రత్ తన తల్లిదండ్రులు సుకాంతి మహారాణా, పద్మనాభం మహారాణా స్ఫూర్తితో పది రోజుల క్రితం యాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గతంలో కూడా గోమాత పరిరక్షణ కోసం ఎనిమిది రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, శ్రీశైలం, తిరుపతి, తమిళనాడులోని అరుణాచలం, రామేశ్వరంలో పలు పుణ్యక్షేత్రాలతో పాటు ఉత్తరభారతదేశంలోని చార్దామ్ పుణ్యక్షేత్రాల దర్శనంతో యాత్ర ముగుస్తుందన్నారు.
రూ.35 వేలు సీజ్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల కార్పొరేషన్ 17వ డివిజన్ బీజేపీ అభ్యర్థి నల్ల రవి కుమారుడు విక్రమ్ దుబ్బపల్లిలోని 70వ పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ చీటీలతో పాటు డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు అతని వద్ద నుంచి రూ.35 వేల నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందానికి అప్పగించినట్లుతెలిపారు. వారి ఫిర్యాదు మేరకు విక్రమ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
పనుల పురోగతి పరిశీలించిన డీఆర్‌ఎం


