కత్తితో పోలింగ్ కేంద్రానికి మహిళ
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో ఓ మహిళ కత్తితో పోలింగ్ కేంద్రానికి రావడం కలకలం రేపింది. ఆదిలాబాద్ పట్టణంలోని 11వ వార్డు రాంనగర్‌లో ఓటు వేసేందుకు వచ్చిన పర్వీన్ అనే మహిళను పోలీసులు తనిఖీ చేయగా ఆమె వద్ద కత్తి లభించింది. ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని మహిళను మావల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత విచారించగా తన ఇంటివద్ద పిల్లలు ఉండడంతో కత్తితో ఆడుకుంటారనే ఉద్దేశంతో వెంట తెచ్చుకున్నట్లు చెప్పినట్లు మావల సీఐ స్వామి పేర్కొన్నారు. ఆ తర్వాత మహిళను వదిలిపెట్టారు. కాగా ఈ ఘటన జిల్లా కేంద్రంలో సంచలనంగా మారింది.


