పోలింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి

Feb 6 2026 8:01 AM | Updated on Feb 6 2026 8:01 AM

పోలింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి

పోలింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి

● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నస్పూర్‌: మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 11న నిర్వహించనున్న పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో మాస్టర్‌ ట్రైనర్ల ఆధ్వర్యంలో పీఓ, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్‌లో పొరపాట్లకు తావు లేకుండా చూడాలని తెలిపారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తాగునీరు, మూత్రశాలలు, విద్యుద్దీపాలు, ఫ్యాన్లు వంటి తదితర అన్ని మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ఈ నెల 11న పోలింగ్‌, 12న అవసరమైతే రీ పోలింగ్‌, 13న ఓట్ల లెక్కింపు ఉంటాయని వివరించారు. పోలింగ్‌కు 48గంటల ముందు ప్రచారాన్ని నిలిపి వేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్టర్‌ ట్రైనర్‌ హరిప్రసాద్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ అనితాదేవి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement