ఓసీ పనులు అడ్డుకున్న నిర్వాసితులు | - | Sakshi
Sakshi News home page

ఓసీ పనులు అడ్డుకున్న నిర్వాసితులు

Feb 6 2026 8:01 AM | Updated on Feb 6 2026 8:01 AM

ఓసీ పనులు అడ్డుకున్న నిర్వాసితులు

ఓసీ పనులు అడ్డుకున్న నిర్వాసితులు

కాసిపేట: నష్టపరిహారం చెల్లించకుండా తమ భూముల్లో పనులు చేపట్టడం ఏమిటంటూ నిర్వాసిత రైతులు కేకే ఓసీ మట్టి పనులను సోమగూడం శివారులో గురువారం అడ్డుకున్నారు. ఆకెనపల్లి శివారుకు సంబంధించి 10.8 ఎకరాల భూములు తమకు ఉన్నాయని, అయినప్పటికీ సింగరేణి యా జమాన్యం పరిహారం అందించకుండా మట్టి తొలగింపు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితుల్లో రెండు వర్గాలు తమకే పట్టా ఉందని వాదనకు దిగడంతో సంఘటన స్థలానికి చేరుకున్న తహసీల్దార్‌ సునిల్‌కుమార్‌దేశ్‌పాండే వారితో మాట్లాడారు. ఎవరివి తప్పుడు పట్టాలో, ఒరిజినల్‌ పట్టాలు ఎవరివో రికార్డుల్లో తేలుతుందని, పూర్తి వి వరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలి పారు. నిర్వాసితులు చట్టప్రకారం తేల్చుకోవాలని, పనులు అడ్డుకుంటే చర్యలు తప్పవని తెలిపారు. కాసిపేట ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా పట్టాలు ఉన్నాయని కొందరు, కబ్జాలో తామే ఉన్నామని మరికొందరు, కోర్టు ఆర్డర్‌ వచ్చిందంటూ కొందరు నష్టపరిహారం కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో అధికారులు అయోమయంలో పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement