అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి
భీమారం: అమ్మకు అక్షరమాల ద్వారా వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దనున్నట్లు జిల్లా వయోజనవిద్యాధికారి పురుషోత్తంనా యక్ తెలిపారు. గురువారం స్థానిక ఎంఈవో కార్యాలయంలో ఉల్లాస్ అమ్మకు అక్షరమాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్, ఎంఈవో శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం గడ్డంశ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ విజయలక్ష్మి, వాలంటీర్లు పాల్గొన్నారు.
ఎస్టీపీపీలో ఉచిత
కంప్యూటర్ శిక్షణ
జైపూర్: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో ఎస్టీపీపీ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులను ఎస్‌ఈడబ్ల్యూఏ అధ్యక్షురాలు శివకుమారిచిరంజీవి, గౌరవ అధ్యక్షురాలు ఆశనర్సింహారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీపీపీ ప్రభావిత గ్రామాల్లోని యువత, మహిళలకు డీటీపీ శిక్షణ అందిస్తామని తెలిపారు. మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి శిక్షణ తరగతులు నిర్వహించామని అన్నారు. అనంతరం గత సంవత్సరం టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం మదన్‌మోహన్, లేడీస్ క్లబ్ సెక్రెటరీ నిలిమాపంతుల, సీఎంవోఏఐ ప్రెసిడెంట్ పంతులా, ఫిట్‌సెక్రెటరీ పర్శయ్య, డీజీఎం పర్సనల్ కిరణ్‌బాబు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకుర్‌మోహన్‌సింగ్, సేవా సమితి కో–ఆర్డినేటర్ అరుణ పాల్గొన్నారు.
అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి


