న్యాయవాదుల విధులు బహిష్కరణ
మంచిర్యాలక్రైం/లక్సెట్టిపేట/బెల్లంపల్లి: రంగారెడ్డి చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు స్వప్న హత్యను తీవ్రంగా ఖండిస్తూ గురువారం జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో న్యాయవాధులు విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాలలో బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులను న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణించాలని అన్నారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భుజంగరావు, న్యాయవాదులు రవీందర్‌రావు, రంగు మల్లేష్, దత్తాత్రేయ, సతీష్, వేణుకుమార్, తదితరులు పాల్గొన్నారు. లక్సెట్టిపేటలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, బెల్లంపల్లిలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకెం శివకుమార్, కార్యదర్శి చేను రవికుమార్, సీనియర్ న్యాయవాదులు ఎల్.రాము, నల్లుల సంగీత, న్యాయవాదులు పాల్గొన్నారు.
న్యాయవాదుల విధులు బహిష్కరణ


