ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాలు అందించాలి

Feb 6 2026 8:01 AM | Updated on Feb 6 2026 8:01 AM

ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాలు అందించాలి

ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాలు అందించాలి

మంచిర్యాలటౌన్‌: జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థులకు ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాలు అందించాలని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్‌ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థుల ఉపకార వేతనాలను వంద శాతం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, కుల, ఆదాయ ధ్రువపత్రాలను మీసేవా కేంద్రాల్లో నమోదు వేగవంతం చేసి రెండ్రోజుల్లో తహసీల్దార్‌ కార్యాలయాల్లో జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించాలని, ఆధార్‌కార్డులను బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేయించి, ఖాతాలకు మొబైల్‌ నంబర్‌తో అనుసంధానం చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు ప్రశాంత్‌, ధర్మానంద్‌గౌడ్‌, వసతి గృహ సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ గడువు పొడిగింపు

మంచిర్యాలటౌన్‌: పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ దరఖాస్తుల గడువును మార్చి 31వరకు పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎన్‌.రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. మైనారిటీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ దరఖాస్తు నమోదుకు డిసెంబర్‌ 31వ తేదీ చివర కాగా, మార్చి 31వరకు పొడిగించారని తెలిపారు. విద్యార్థులు http://telanga naepass.cgg.gov.in ద్వారా పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌(ఫ్రెష్‌, రెన్యువల్‌) దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement