‘విజయవంతం చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘విజయవంతం చేయాలి’

Feb 12 2026 7:13 AM | Updated on Feb 12 2026 7:13 AM

‘విజయవంతం చేయాలి’

‘విజయవంతం చేయాలి’

శ్రీరాంపూర్‌: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా గురువారం జరపతలపెట్టిన సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం ఎస్సార్పీ 1, ఎస్సార్పీ 3 గనులపై గేట్‌ మీటింగ్‌ నిర్వహించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం 4 లేబర్‌ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. ఇవి అమలైతే కార్మికులు కట్టు బానిసల్లాగా పనిచేయాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, ఐఎన్టీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు జట్టి శంకర్‌రావు, సీఐటీయూ నాయకులు శ్రీనివాస్‌, భూపాల్‌ రెడ్డి, చంద్రశేఖర్‌, టీబీజీకేఎస్‌ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఐఎఫ్‌టీయూ నాయకులు డీ.బ్రహ్మానందం, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement