విధులకు ఆటంకం కలిగించొద్దు
ఖానాపూర్: అటవీశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని ఖానాపూర్ ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వో శ్రీనివాస్‌రావు హెచ్చరించా రు. పట్టణంలోని అటవీశాఖ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. అటవీశాఖ అధికారులు ఎడ్లను నిర్బంధించారనే ఆరోపణలు అవా స్తవమని పేర్కొన్నారు. ఇటీవల తర్లపాడ్ గ్రా మానికి చెందిన బోసు భూమన్న అటవీశాఖ అ ధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ, పొ ర్లు దండాలతో నిరసన తెలిపి అధికారులు, ప్ర జలను తప్పుదోవ పట్టించాడని ఆరోపించారు. పోడు సాగు చేస్తుండడంతో పూచీకత్తుతో వచ్చి ఎడ్లను తీసుకెళ్లాలని కోరినా రాలేదని పేర్కొన్నారు. ఖానాపూర్ రేంజ్ పరిధిలోని సౌత్ బీట్‌లోని 877 కంపార్ట్‌మెంట్‌లో భూమన్నకు ఎక రం 10 గుంటల లావుని పట్టా భూమి మాత్ర మే ఉందని తెలిపారు. లావణి పట్టా భూమి ప క్కనే గల అటవీ భూమిలోకి అక్రమంగా చొ చ్చుకు వచ్చి ఇష్టారీతిన అటవీ భూమిలో పోడు సాగు చేస్తున్నాడని ఆరోపించారు. భూమన్న ఆరోపించినట్లు 40 ఏళ్ల నుంచి సాగులో లేడని తెలిపారు. 2014 నుంచి అటవీ భూమిలో పో డు వ్యవసాయం పేరుతో అటవీశాఖకు చెందిన భూమిని ఇష్టారీతిన ఆక్రమించుకుంటున్నాడని పేర్కొన్నారు. అడవిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేయడంతో పాటు ఆక్రమణలు, ఆందోళనలు చేయడంతో ఇప్పటికే భూమన్న పేరిట అటవీశాఖలో మూడు కే సులతో పాటు పోలీసు శాఖలో రెండు కేసులు, ఒక బైండోవర్ నమోదై ఉందని వివరించారు. ఇష్టారితిన అటవీ భూమిని ఆక్రమించుకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్‌లో పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎఫ్‌ఎస్వో రవీందర్, ఎఫ్‌బీవో నరేందర్ తదితరులున్నారు.


