గంజాయి తరలిస్తున్న ముగ్గురిపై కేసు
ఇంద్రవెల్లి: గంజాయి తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఉట్నూర్ సీఐ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మర్కగూడ గ్రామపంచాయతీ పరిధిలోని నవగూడ గ్రామానికి చెందిన కొడప రమేశ్ అలియాస్ కొడప గంగు, కుంర గంగారాం, మర్కగూడ కొలాంగూడకు చెందిన కుంర కృష్ణ కలిసి నవగూడ నుంచి ద్విచక్ర వాహనంతో గంజాయి తరలిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు స్థానిక ఎస్సై సాయన్న సిబ్బందితో ఇంద్రవెల్లి గ్రామ పోలిమేరలో తనిఖీ చేశారు. వారి నుంచి నాలుగు కిలోల గంజాయి, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కానిస్టేబుల్ జాదవ్ రాహుల్, సిబ్బంది ఉన్నారు.


