ప్రచారం ముగిసె.. కూలి లేకపాయె..
ఓవర్‌బ్రిడ్జి వద్ద అడ్డా కార్మికులు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ ప్రచారంతో బోసిపోయిన కార్మికుల అడ్డాలు మళ్లీ కళకళలాడుతున్నాయి. వారం రోజులుగా అడ్డా కార్మికులు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. రోజూ కూలీతో పాటు భోజనం ఇతరత్రా లాభాలు పొందారు. దీంతో ఇన్నాళ్లు అడ్డాల వద్ద కూలీలు కనిపించలేదు. ఎన్నికల ప్రచారం ముగియడంతో మళ్లీ అడ్డాలు కార్మికులతో నిండి కనిపిస్తున్నాయి. కానీ పని దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. – మంచిర్యాలరూరల్ (హాజీపూర్)
ప్రచారం ముగిసె.. కూలి లేకపాయె..


