జనసంద్రమైన జాతీయ బంజారా దీక్షభూమి
నార్నూర్: మహాశివరాత్రి పురస్కరించుకొని మండలంలోని కొత్తపల్లి–హెచ్ గ్రామంలో జాతీయ బంజారా దీక్షభూమి ఆదివారం జనసంద్రమైంది. వివిధ ప్రాంతాల నుంచి బంజారాలు తరలివచ్చారు. దీక్ష గురువు శ్రీ సద్గురు ప్రేంసింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో పలువురు బంజారాలు సేవాలాల్ మహారాజ్ దీక్ష స్వీకరించారు. అనంతరం భోగ్‌బండారో పూజలు నిర్వహించారు. ఈ దీక్షలు శ్రీరామనవమి వరకు 41 రోజులు కొనసాగనున్నాయి. దీక్ష గురువు మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావంతో చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సేవాలాల్ మహరాజ్ ఆశయసాధనకు ప్రతి బంజారా బిడ్డ ఈ దీక్ష స్వీకరించాలన్నారు.


