క్రీడానైపుణ్యం వెలికితీసేందుకే పోటీలు
మంచిర్యాలటౌన్: యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యతను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ పోటీలకు శనివారం ఆయన హాజరయ్యారు. బాక్సింగ్ పోటీలను ప్రారంభించారు. క్రీడల ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని, నాయకత్వ లక్షణాలతో టీం వర్క్ ప్రాధాన్యత తెలుస్తుందని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా సేవల అధికారి గుర్రాల హనుమంతరెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, క్రీడాకారులు పాల్గొన్నారు.


