వేర్వేరు చోట్ల మద్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల మద్యం పట్టివేత

Feb 10 2026 7:58 AM | Updated on Feb 10 2026 7:58 AM

వేర్వేరు చోట్ల మద్యం పట్టివేత

వేర్వేరు చోట్ల మద్యం పట్టివేత

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లను సోమవా రం పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ బా లాజీ వరప్రసాద్‌ తెలిపారు. పట్టణంలోని శ్రీలక్ష్మి హోటల్‌లో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్‌షాపు ని ర్వహిస్తున్నట్లు తమకు అందిన సమాచారం మేరకు ఎస్సై ఉదయ్‌కిరణ్‌ ఆద్వర్యంలో హోటల్‌లో తనిఖీ చేపట్టగా రూ.87,720 విలువైన వివిధ రకాల మ ద్యం సీసాలు లభ్యమైనట్లు తెలిపారు. యజమాని రంజిత్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

మద్యం స్వాధీనం

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని కొత్త కుమ్మరివాడ కాలనీలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 70 (క్వార్టర్‌) మద్యం బాటిళ్లను సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. తమకు అందిన స మాచారం మేరకు ఎఫ్‌ఎస్‌టీ బృందంతో కలిసి రామిలి పోశెట్టి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా మద్యం నిల్వలు గుర్తించామన్నారు. వాటి విలువ సుమారు రూ.7,699 ఉంటుందన్నారు. ఎఫ్‌ఎస్‌టీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, మఫ్టీ బృందాలతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

నగదు, మద్యం పట్టివేత

చెన్నూర్‌: చెన్నూర్‌ మున్సిపాలిటీలో సోమవారం నగదు, మద్యం పట్టుకున్నట్లు సీఐ బన్సీ లాల్‌ తెలిపారు. మున్సిపాలిటీలోని 15వ వార్డు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుర్రం ఉమాదేవి అనుచరుడు పడమటింటి శ్రీనివాస్‌ నుంచి రూ.1.50 లక్షలు, 12వ వార్డు బీజేపీ అభ్యర్థి అడుప రేణుకాదేవి అనుచరుడు రాపర్తి కిరణ్‌ వద్ద నుంచి 94 మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై సుబ్బారావు, ఏవో యామిని, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement