ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ బాల, బాలికల వాలీబాల్ జట్ల ఎంపిక పోటీలు శుక్రవారం మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు హాజరు కాగా విశేష ప్రతిభ కనబరిచిన వారిని జట్లకు ఎంపిక చేశారు. ఎంపికై న జట్లు ఈ నెల 16నుంచి 19వ తేదీ వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి యూత్ బాల, బాలికల వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. జట్ల ఎంపికలో డీవైఎస్వో హన్మంతరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి రమేశ్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బైరగోని సిద్ధయ్యగౌడ్, కోశాధికారి గాజుల శ్రీనివాస్, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి యాకూబ్, పీడీలు రామ్మెహన్‌రావు, గోపాల్, సుదర్శన్, రాజయ్య, పీఈటీలు రాజా, విఠల్, సత్యనారాయణ వరలక్ష్మి, రెఫరీలు ప్రేమ్‌కుమార్, రమేశ్, మనోహర్ పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లా వాలీబాల్ జట్ల ఎంపిక


