బీఆర్‌ఎస్‌ రాష్ట్రానికి చేసిందేమీ లేదు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ రాష్ట్రానికి చేసిందేమీ లేదు

Feb 9 2026 7:55 AM | Updated on Feb 9 2026 7:55 AM

బీఆర్‌ఎస్‌ రాష్ట్రానికి చేసిందేమీ లేదు

బీఆర్‌ఎస్‌ రాష్ట్రానికి చేసిందేమీ లేదు

● పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

● పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రామకృష్ణాపూర్‌: బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. క్యాతనపల్లి మున్సి పాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఆదివారం నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుని అప్పులపాలు చేసిందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా కాంగ్రెస్‌ ప్ర భుత్వం గెలిచిన ఏడాదిలోనే అనేక హామీలు నె రవేర్చిందన్నారు. సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే జీవో ఇప్పించామన్నారు. చెన్నూర్‌ నియోజకవర్గంలో రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మున్సిపల్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసే అవకాశముంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్‌, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, కౌన్సిలర్‌ అభ్యర్థులు పనాస రాజు, పొలం సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement