సర్వీస్ నిబంధనలు పాటించాలి
ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ డివిజన్ పరిధి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పరిధిలోని ఉద్యోగులంతా ప్రభుత్వ సర్వీస్ రూల్స్ పాటించాలని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్‌కుమార్ సూచించారు. శుక్రవారం కేబీ ప్రాంగణంలోని పీఎంఆర్సీ సమావేశ మందిరంలో జీసీసీ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన రెండురోజుల శిక్షణ ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో పాల్గొని మాట్లాడారు. రెండోరోజు ఉద్యోగ నియమావళి, సర్వీస్ రూల్స్, సీసీఏ రూల్స్, ప్రాథమిక నియమాలు, బాధ్యతలు, లీవ్ రూల్స్, క్రమశిక్షణ చర్యలు లాంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. రిసోర్స్ పర్సన్స్ రవికుమార్, వేణు తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. ఉద్యోగులు అంకితభావం కలిగి ఉండాలని, గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన జీసీసీని బలోపేతం చేస్తూ సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఎవరైనా సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సీనియర్ మేనేజర్లు సంతోష్‌కుమార్, తార చంద్, సూపరింటెండెంట్ గులాబ్‌సింగ్, మేనేజర్లు శ్రీనివాస్, ఇస్తారి, లక్ష్మణ్, మనోహర్ అకౌంటెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డివిజనల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.


