ఫుడ్‌పాయిజన్ బాధ్యులపై కఠిన చర్యలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి ఎస్సీ సమీకృత బాలికల వసతిగృహంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనకు కారకులైన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను శనివా రం పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్‌తో కలిసి ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. వంట గది, భోజన తయారీ విధానం, ఆహార నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫోన్‌లో మాట్లాడారు. అలాగే ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థినులను ఎమ్మెల్సీ మల్క కొమురయ్య పరామర్శించారు. వారికి అందిస్తున్న వైద్యసేవల గురించి సూపరింటెండెంట్ రవిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లేకనే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు సబ్ కలెక్టర్ మనోజ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కాగా, ఏబీవీపీ ఇతర విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు విద్యార్థినులను ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఫుడ్‌పాయిజన్ బాధ్యులపై కఠిన చర్యలు


