బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ముఖేష్‌గౌడ్
మంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా గాజుల ముఖేష్‌గౌడ్‌ను ఆ పార్టీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ సన్మానించారు. అనంతరం కార్పొరేటర్లు బొట్ల అనిత, తోటపల్లి రాజేశ్వరి, వనపర్తి కేత, లక్సెట్టిపేట కౌన్సిలర్లు గర్రెపల్లి శాంతరాణి, ఏతం శివకృష్ణలకు ఘనంగా సన్మానం చేశారు. ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై కౌన్సిల్‌లో గళం విప్పి పరిష్కారం, పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు బీజేపీ..
గాజుల ముఖేష్‌గౌడ్ గతంలో మున్సిపాల్టీలోనూ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. 2005లో అప్పటి మంచిర్యాల మున్సిపాల్టీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎన్నికయ్యారు. ఆ పార్టీ నుంచి ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత మేయర్ ప్రతిపాదిత అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా గెలుపొందారు. మెజార్టీ రాకపోవడంతో ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వస్తోంది. బీజేపీ నుంచి ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించనున్నారు.


