దుబాయి నుంచి వచ్చి.. ఓటేసి
ఖానాపూర్: ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లా. మరో రెండు నెలల తర్వాత ఇండియాకు రావాల్సి ఉంది. అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికలు ఉన్న విషయం తెలియడంతో రెండు రోజుల క్రితమే స్వగ్రామం ఖానాపూర్‌కు వచ్చా. ఓటుహక్కు వినియోగించుకోవడం ఆనందంగా ఉంది.
నోటిఫికేషన్ రావడంతో తిరిగొచ్చా
ఖానాపూర్:ఇటీవల విజిట్ వీసాపై దుబాయ్‌కి వెళ్లా. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మరికొద్ది రోజులు అక్కడే ఉండాల్సి ఉన్నప్పటికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెంటనే ఖానాపూర్‌కు తిరిగి వచ్చా. ఓటుహక్కు వినియోగించుకున్నా.
దుబాయి నుంచి వచ్చి.. ఓటేసి


