‘కమ్యూనిస్టులే అసలైన ప్రజా సేవకులు’ | - | Sakshi
Sakshi News home page

‘కమ్యూనిస్టులే అసలైన ప్రజా సేవకులు’

Feb 7 2026 2:01 PM | Updated on Feb 7 2026 2:01 PM

‘కమ్యూనిస్టులే అసలైన ప్రజా సేవకులు’

‘కమ్యూనిస్టులే అసలైన ప్రజా సేవకులు’

శ్రీరాంపూర్‌: కమ్యూనిస్టులే అసలైన ప్రజా సేవకులని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కార్పొరేషన్‌ పరిదిలోని 6వ వార్డులో సీపీఐ అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో తిరుగుతూ సీపీఐని గెలిపించాలని కోరారు. సింగరేణిపై గడ్డపై ఎర్ర జెండాకు ఒక ప్రత్యేక ప్రస్థానం ఉందన్నారు. కార్మిక వర్గానికి, ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర సీపీఐకి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్‌, మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి బాజీసైదా, నాయకులు బొడ్డు లక్ష్మణ్‌, రాజ్‌కుమార్‌, మిర్యాల రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement