వరంగల్ జిల్లా: కుటుంబ సభ్యులకు దూరమయ్యాననే మనస్తాపంతో ఓ ట్రాన్స్‌జెండర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వరంగల్‌లోని రామగోపాలపూర్‌లో చోటు చేసుకుంది. మామునూరు ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్న మడిసిలేరు గ్రామానికి చెందిన సోది కృష్ణ కుమారుడు శివప్రసాద్ అలియాస్ రాజేశ్వరి (20) నాలుగు సంవత్సరాల నుంచి బంధువు శ్యామల అక్షరతో కలిసి రామగోపాలపూర్‌లో నివసిస్తోంది.
ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం శివప్రసాద్ ట్రాన్స్ జెండర్‌గా సర్జరీ చేయించుని రాజేశ్వరిగా పేరుమార్చకున్నాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నానని మనస్తాపానికి గురవుతోంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రామగోపాలపూర్‌లో తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై ట్రాన్స్ జెండర్ తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.


