సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు శుభవార్త. రైలు ప్రయాణీకుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్(Sleeping Pods)లను ఏర్పాటు చేసింది. సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునేందుకు రైల్వేశాఖ స్లీపింగ్ పాడ్‌లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్‌లను ప్రయాణీకుల కోసం సిద్ధం చేసింది. రైలు పెట్టెలో పడకలను తలపిస్తూ లాకర్ల సదుపాయంతో కూడిన ఈ స్లీపింగ్ పాడ్‌లు ఆకట్టుకొంటున్నాయి. మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా వీటి ఛార్జీలను నిర్ణయించారు. రెండు గంటలకు రూ.200 కాగా.. ఆరు గంటలకు రూ.400, 12 గంటలకు రూ.800, 24 గంటలకు రూ.1200గా ధరలను నిర్ణయించారు. తొలుత జపాన్‌లో ప్రారంభమైన ఈ తరహా వసతి ఏర్పాటు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో వీటిని ప్రారంభించిన అధికారులు.. తాజాగా ఈ సౌకర్యాన్ని చర్లపల్లి రైల్వే స్టేషన్‌లోనూ ఏర్పాటు చేశారు.
Sleeping Pods Facility Set up at #Charalapalli Railway Station to enhance passenger comfort in economical charges @RailMinIndia @drmsecunderabad @drmhyb #passengeramenities #comfort #travel pic.twitter.com/BoFTENVAvV
— South Central Railway (@SCRailwayIndia) December 26, 2025


