బౌద్ధనగర్: తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై కక్ష పెంచుకొని ఆమె కుటుంబ సభ్యుల ముందే దారుణంగా హత్య చేసి పరారైన ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు బుధవరం చిలకలగూడ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ బాల స్వామి వివరాలు వెల్లడించారు.
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా మిర్యాపుట్టి మండలం సిరియకంది గొల్లవీధికి చెందిన డుక్క ఉమా శంకర్ కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి రహ్మత్‌నగర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో దూరపు బంధువు అయిన కాంతారావు, లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె పవిత్రను తనకిచ్చి పెళ్లి చేయాలని కోరడంతో వారు అంగీకరించారు. ఆరు నెలల క్రితం నిశి్చతార్థం కూడా జరిగింది. అయితే, ఉమా శంకర్‌కు మద్యం అలవాటు ఉంది.
తాగిన ప్రతీసారి పవిత్రకు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించి విసిగించాడు. ఈ నేపథ్యంలో అతడిని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో కక్షగట్టిన ఉమాశంకర్ గత సోమవారం పవిత్రను ఆమె తల్లిదండ్రుల ముందే గొంతుకోసి హత్యచేసినట్లు వెల్లడించారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీలను పరిశీలించి హంతకుడు ఉమాశంకర్ చిలకలగూడలోని తన సోదరుడి ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. బుధవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ శశాంక్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి, డీఐ పురేందదర్ రెడ్డి, డీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


