పాసులుంటేనే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు ఎంట్రీ | Hyderabad Police Tighten Security, Entry Only With Passes For Messi ‘GOAT’ Football Match At Uppal Stadium | Sakshi
Sakshi News home page

పాసులుంటేనే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కు ఎంట్రీ

Dec 11 2025 9:49 AM | Updated on Dec 11 2025 10:05 AM

CM Revanth Reddy Vs Lionel Messi Football Match

సాక్షి, హైదరాబాద్‌: అర్జెంటీనా ప్రముఖ ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ మెస్సీ ‘గోట్‌’ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌కి పాస్‌ లేకుంటే అనుమతి లేదని రాచకొండ పోలీసులు ఆదేశించారు. ఈ నెల 13న (శనివారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి– మెస్సీతో ఉప్పల్‌ మైదానంలో మెస్సీ– గోట్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌ స్టేడియం వద్ద రద్దీ ఏర్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్‌ సు«దీర్‌ బాబు తెలిపారు. టికెట్, పాసులు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, వారికి మాత్రమే అనుమతి ఉంటుందని మిగతా వారికి ఎట్టి పరిస్థితిలో అనుమతి ఉండదని కమిషనర్‌ స్పష్టం చేశారు. ఈ మ్యాచ్‌కు అత్యంత కట్టుదిట్టమైన, భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement