సాక్షి, హైదరాబాద్: మహా నగరం గజగజా వణుకుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణ శీతాకాల ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతోంది. శివారు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ రికార్డు అవుతోంది. మరోవైపు ఉదయం 8 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. దీంతో రోడ్లపై రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. సగటు కనిష్ట ఉష్ణోగ్రత 13.2 డిగ్రీలు నమోదు కాగా, పటాన్‌చెరులో 7.8, రాజేంద్రనగర్‌లో 9.5, హయత్‌నగర్ 10 డిగ్రీలు నమోదయ్యాయి.


