దుబ్బాకరూరల్: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ కీర్తి రాజ్ వివరాల ప్రకారం... రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల సుష్మ(32)ను పన్నెండేళ్ల క్రితం శ్రీకాంత్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. కొంత కాలంగా భర్త, అత్తామామల నుంచి పలు రకాలుగా వేధింపులు ఎక్కువయ్యాయి.
తల్లిదండ్రులకు తరుచు తెలుపడంతో నచ్చజెప్పేవారు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఉరి వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె మృతికి అల్లుడు శ్రీకాంత్, అత్త ఎల్లవ్వ, మామ బాబు కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.


