31 తులాల బంగారు ఆభరణాల చోరీ
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగ
మరో రెండిళ్లలో చోరీకి యత్నం
రాజేంద్రనగర్: కిటికీ పక్కనే ఇంటి ప్రధాన ద్వారం ఉండటం దొంగ వరంగా మారింది. కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా 31 తులాల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిస్మత్‌పూర్ ఓంనగర్ ఎస్‌ఎం ఎన్‌క్లేవ్‌లో కిరణ్ గౌడ్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. కిరణ్ బంధువుల ఇంట్లో గురువారం వివాహం జరగాల్సి ఉంది. లాకర్ నుంచి 31 తులాల బంగారు ఆభరణాలు తీసుకొచ్చి ఇంట్లోని బీరువాలో భద్రపరిచాడు.
మంగళవారం కుటుంబ సభ్యులంతా నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి 2.50 గంటల సమయంలో ఇంటి వెనకాలే ఉన్న పిట్ట గోడ దూకి లోనికి వచి్చన దొంగ.. ప్రధాన ద్వారం పక్కనే తెరిచి ఉన్న కిటికీలోంచి చెయ్యిపెట్టి గడియ తీసి లోపలికి వెళ్లాడు. బీరువాలోని బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. అంతకుముందు ఇదే ఎన్‌క్లేవ్‌లోని రెడ్డి విజయ్ ఇంటి తాళాన్ని పగులగొట్టి లోనికి వెళ్లాడు. బీరువా కప్ బోర్డు అన్ని వెతకగా ఏమీ దొరకలేదు. దీంతో కప్ బోర్డు తలుపులను విరగ్గొట్టి బయట పడేశాడు. కిరణ్ గౌడ్ ఇంట్లో చోరీ అనంతరం మరో ఇంటి ప్రహరీ దూకి లోపలికి వెళ్లా డు. అçప్పుడే నిద్ర లేచిన యజమాని ఎవరు అని ప్రశ్నించే లోపు గోడ దూకి పరారయ్యాడు. ఎంఎస్ ఎన్‌క్లేవ్ వాచ్‌మన్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.


